విన్నకోట నరసింహా రావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కష్టేఫలి;విన్నకోట నరసింహా రావు

ఆహాఁ, ఏమిటో వాళ్ళు చేసిన / చేస్తున్న అంత ఘనత వహించిన CSR ? ఏ కంపెనీ? ఎక్కడ? చెప్పండి, విని తరిస్తాం.

ముందు చెట్లని కొట్టేసి కాంక్రీట్ హర్మ్యాలు కట్టడం, ఆ తరువాత పేవ్ మెట్ మీద మొక్కలు నాటడం.

06 May 2024 1:26 PM

కష్టేఫలి;విన్నకోట నరసింహా రావు

ఇంటర్, ఎమ్సెట్ ర్యాంకుల్ని కార్పొ’రెట్ట’ కాలేజీలు చెప్పే విధంగా ఉంది మీరు టెంపరేచర్ చెబుతున్న పద్ధతి 😃😃.

Good Friday తో సహా ప్రతిదానికీ శుభాకాంక్షలు చెబుతున్న ఈతరం రోజుల్లో వీటిని మాత్రం (“వడగాలి, ఉక్కపోత”) ఎందుకు వదలాలి అంటారా? అలాక్కానివ్వండి 😃😃.

కార్పొ’రెట్ట’ లు తమ వ్యాపారం, లాభాల కోసం ఆకుపచ్చదనం లేకుండా పర్యావరణాన్ని కాంక్రీట్ జంగిళ్ళతో నాశనం చేసి, వేలకోట్ల రూపాయలను తమ జేబుల్లో నింపుకుంటున్నారు. నియంత్రించవలసిన వారు చోద్యం చూస్తున్నారు. దారుణమైన ఫలితాలను అనుభవిస్తున్నాం.

06 May 2024 9:18 AM

కష్టేఫలి;విన్నకోట నరసింహా రావు

చెప్పేవాడికి వినేవాడు లోకువ అని కూడా అనచ్చండి ఈ రోజుల్లో - ఆ చెప్పేది రాజకీయ ఉపన్యాసాలయినా, యూట్యూబ్ లో కనిపించే కొన్ని కొన్ని సలహాలయినా.

29 April 2024 12:00 PM

కష్టేఫలి;విన్నకోట నరసింహా రావు

నెయ్యి గిన్నె పట్టుకుని ఇక్కడకొచ్చారా “జిలేబి” గారు?

26 April 2024 1:06 PM

భువి భావనలు;విన్నకోట నరసింహా రావు

ఆ తరువాత “అమ్మ పెట్టే ఆ రెండూ పెడితేనే గానీ” బువ్వ తినదు 🙂.

26 April 2024 1:04 PM

కష్టేఫలి;విన్నకోట నరసింహా రావు

అవును సార్, తెలియలేదు, అదేగా ఇప్పుడు బాధ. పని చేసి మెప్పించడమే అనుకున్నాం గానీ ఇతర మార్గాల ద్వారా కూడా చంకెక్కవచ్చని ఊహించలేదు 😏. అదంతా ఇప్పుడు గతజల సేతుబంధనం 😒.

26 April 2024 10:33 AM

వరూధిని;విన్నకోట నరసింహా రావు

వార్నీ, మీకలా అర్థమయిందా 😳?
మీతో జాగ్రత్తగా ఉండాలి సుమండీ, లేకపోతే తంపులు పెట్టెయ్యగలరు 😕.

26 April 2024 9:01 AM

వరూధిని;విన్నకోట నరసింహా రావు

వానప్రస్థాశ్రమంలో చింతచెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తుంటే కొన్ని “చింతలు” కలగక తప్పదండీ. కృష్ణా రామా అని ఎంతసేపు జపం చేస్తారు ఎవరయినా?

26 April 2024 8:05 AM

కష్టేఫలి;విన్నకోట నరసింహా రావు

అకటా, ఈ “విద్యల” గురించి ఉద్యోగంలో జేరిన కొత్తలో తెలిస్తే బాగుండేది కదా 😕.

25 April 2024 8:48 AM

వరూధిని;విన్నకోట నరసింహా రావు

సూవె లేదు, సుమ్ము లేదు. శర్మగారు చెప్పినది తేటతెల్లంగానే ఉందిగా. అయినా ప్రతి పోస్ట్ మీద ఎందుకు వ్యాఖ్యానించడం?

25 April 2024 7:40 AM

వరూధిని;విన్నకోట నరసింహా రావు

కృష్ణా జిల్లాలో అయితే వాడుకలో ఉంది (ఉండేది అందామా? ఈ కాలంలో తెలుగు మాట్లాడేవారే కరువైపోతున్నారు; “సెండ్ చేశాను” వంటి భాష మాట్లాడుతున్న ఈ రోజుల్లో ఇక కుదుమట్టం లాంటి పదాలు వాడడం కూడానా?)

24 April 2024 8:32 AM

My Soul On Canvas మనః ఫలకం;విన్నకోట నరసింహా రావు

పరికిణీకు ఓ ఊదారంగు గీత, ఓ ఆకుపచ్చ రంగు గీత కూడా గీస్తే VIBGYOR / ఇంద్రధనస్సు లాగా ఉంటుంది 🙂. అయినా మొత్తానికి రంగురంగులతో బహు సుందరంగా ఉంది 👌. చాలా ఓపికగా రంగులద్దారు.

చిత్రానికి మీరు పెట్టిన పేరు కూడా చక్కగా కుదిరింది. నిజంగా Happy Girl అనిపిస్తుంది చూడగానే. ఆ మొహంలో ఆ సంతోషం ప్రతిబింబిస్తోంది.

One of your finest works I will say 👏.

22 April 2024 8:42 AM

కష్టేఫలి;విన్నకోట నరసింహా రావు

అందరూ మీలాగే ఉంటారు అనుకుంటే ఎలా “జిలేబి” గారూ?

20 April 2024 3:22 PM

కష్టేఫలి;విన్నకోట నరసింహా రావు

అలాక్కానివ్వండి. ఈ సారి మీ ఊరు వచ్చినప్పుడు వారిద్దరినీ కూడా మాకు పరిచయం చేసి, వారి దర్శనభాగ్యం కలిగించాలండి 🙏. .

Delete

19 April 2024 12:00 PM

కష్టేఫలి;విన్నకోట నరసింహా రావు

అలాక్కానివ్వండి. ఈ సారి మ ఊరు వచ్చినప్పుడు వారిద్దరినీ కూడా మాకు పరిచయం చెయ్యాలండి.

19 April 2024 11:58 AM

కష్టేఫలి;విన్నకోట నరసింహా రావు

తప్పకుండా చెప్పండి.
కార్పొరేట్లు necessary evil అయ్యారండి. కాబట్టి అసలు రాకుండా తరిమెయ్యమనడం లేదు కానీండి అన్నింటినీ ఒకే ఊళ్ళో పోగేసుకు కూర్చోకుండా ఒక్కోదాన్ని రాష్ట్రంలో ఒక్కో ఊరికి తోలెయ్యమంటున్నానండి.

19 April 2024 11:56 AM

వరూధిని;విన్నకోట నరసింహా రావు

// “నాలు పక్కం తణ్ణీర్ తణ్ణీర్” //
అంటూ వగచిన వారెవరో? తమరు కాదా? నివాసప్రాంతం ఏదో తెలియకుండానే వగచారా?

19 April 2024 8:39 AM

వరూధిని;విన్నకోట నరసింహా రావు

మీ నివాసమూ ఆ ఊరేనట కదా?
మన YVR ని మీరు అప్పుడప్పుడు పలకరిస్తుంటే వారి భోగట్టా తెలుస్తుంటుంది కదా?

18 April 2024 8:34 AM

కవి'తల' అలలు;విన్నకోట నరసింహా రావు

అవును, కస్టమర్ కేర్ లో సదరు సంస్ధ కేరే గానీ కస్టమర్ గురించి కేర్ ఏమీ ఉండదండి.

15 April 2024 9:49 AM

సుజన - సృజన;విన్నకోట నరసింహా రావు

ఉగాది శుభాకాంక్షలు, మాస్టారూ.

09 April 2024 8:38 PM